చిరంజీవి 'గాడ్ ఫాదర్' మూవీ ట్రైలర్ విడుదల అప్పుడే..?

Pulgam Srinivas
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయిన మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికి కూడా ఫుల్ క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ని కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వం లో తేరకకుతున్న గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటించాడు.  


ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు తో పాటు హిందీ లో కూడా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలను చేస్తుంది. ఇప్పటికే ఈ మూవీ హిందీ హక్కులు కూడా అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సన్శేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించగా ,  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండగా ,  లేడీ సూపర్ స్టార్ నయన తార ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో కనిపించబోతుంది. విలక్షణ నటుడు సత్యదేవ్ ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.


ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ ను మూవీ యూనిట్ విడుదల చేయగా దీనికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. మరి కొన్ని రోజుల్లో ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేయడానికి మూవీ యూనిట్ సన్నాహాలు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ ని సెప్టెంబర్ 25 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: