'ది ఘోస్ట్' మూవీ యాక్షన్ సన్నివేశాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తార్..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నాగర్జున ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ని కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నాగార్జున 'బ్రహ్మాస్త్రం' అనే హిందీ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. సెప్టెంబర్ 9 వ తేదీన విడుదల అయిన బ్రహ్మాస్త్రం మూవీ ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేస్తుంది.


ఇది ఇలా ఉంటే నాగార్జున తాజాగా ది ఘోస్ట్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ , నాగార్జున సరసన హీరోయిన్ గా నటించగా ,  టాలీవుడ్ యంగ్ దర్శకులలో ఒకరు అయి నటు వంటి ప్రవీణ్ సత్తార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా , వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో యాక్షన్స్ సన్నివేశాలు అదిరిపోయే రేంజ్ లో ఉండనున్నట్లు తెలుస్తున్నాయి.


ఈ మూవీ లో యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించడం కోసం దర్శకుడు ప్రవీణ్ సత్తార్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లోని యాక్షన్స్ సన్నివేశాలను తెరకెక్కించడం కోసం చాలా స్పెషల్ కేర్ ని కూడా దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: