మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఈ సంవత్సరం దర్శకతీరుడు
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్
మూవీ తో అద్భుతమైన బ్లాక్
మాస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ
మూవీ లో
జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక హీరోగా నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
రామ్ చరణ్ ,
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్
ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ లో కీయార అద్వానీ
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , దర్శకుడు మరియు నటుడు అయినటువంటి
ఎస్ జె సూర్య ఈ
మూవీ లో ప్రతి నాయకుడు పాత్రలో కనిపించబోతున్నాడు.
సునీల్ ,
అంజలి ఈ
మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనుండగా , ప్రముఖ
నిర్మాత దిల్ రాజు ఈ
మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ
సినిమా షూటింగ్ కొన్ని షెడ్యూల్ లను పూర్తి చేసుకోగా , ప్రస్తుతం కూడా ఈ
మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే
శంకర్ సినిమా తర్వాత
రామ్ చరణ్ ,
గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే
మూవీ లో నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.
కాక పోతే కొంత కాలం క్రితం
రామ్ చరణ్ , గౌతమ్ తిననూరి కాంబినేషన్ లో రాబోయే
సినిమా ఆగిపోయింది అంటూ అనేక వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో
సినిమా ఉండబోతుంది అని కూడా వార్తలు వచ్చాయి. మళ్లీ ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో
సినిమా తెరకెక్కడం కష్టమే అని వార్తలు వస్తున్నాయి. దీనితో
రామ్ చరణ్ మరియు
గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో
సినిమా ఉంటుందా లేదా అనేది ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది.