తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండో వారం కూడా షో నడుస్తోంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రేటింగ్ అయితే వస్తుందని నిర్వాహకులు భావించారు.
ముఖ్యంగా ప్రారంభ ఎపిసోడ్ కి భారీ రేటింగ్ కూడా ఆశించారు. అనూహ్యంగా అదే రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్న కారణంగా కార్యక్రమాన్ని చాలా మంది చూడకుండా నే స్కిప్ చేశారు.
దాంతో ప్రారంభ ఎపిసోడ్ యొక్క రేటింగ్ అత్యంత దారుణంగా ఉంది అంటూ స్వయంగా స్టార్ మా వారు అంటున్నారట.అధికారిక రేటింగ్ కూడా అలాగే ఉంది. తాజా సమాచారం ప్రకారం కేవలం 8.5 రేటింగ్ మాత్రమే ప్రారంభ ఎపిసోడ్ కి నమోదు అయినట్లు తెలుస్తోంది. గత మూడు నాలుగు సీజన్లకు ప్రారంభ ఎపిసోడ్ కి 15 నుండి 20 రేటింగ్ నమోదైన దాఖలాలు ఉన్నాయట..
కేవలం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కారణంగానే ఈ సీజన్ యొక్క ప్రారంభ ఎపిసోడ్ కి ఇలాంటి దారుణమైన రేటింగ్ నమోదు అయిందంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్ కి సరిగా రేటింగ్ రాకున్నా కూడా తప్పకుండా ముందు ముందు ఎపిసోడ్లకి భారీ రేటింగ్ వస్తుందని నమ్మకాన్ని బుల్లి తెర వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారట..
నాగార్జున హోస్టుగా గతంలో కంటే చాలా మెచ్యూరిటీగా వ్యవహరిస్తున్నాడు. సమయస్ఫూర్తితో కంటెస్టెంట్స్ ని ప్రశ్నలతో ముంచేత్తి వారి యొక్క తప్పులను ఎత్తి చెబుతున్నాడట.. కనుక తప్పకుండా ముందు ముందు బిగ్ బాస్ మంచి రేటింగ్ ను సొంతం చేసుకుని మొదటి రేటింగ్ తాలూకు ఇంపాక్ట్ ఉండకుండా చూస్తుందని విశ్లేషకులు అయితే నమ్ముతున్నారు.
వారం వారం మంచి టాస్క్ లతో బిగ్ బాస్ ని ప్రేక్షకులకు మరింత చేరువ చేసేలా నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. కనుక ముందు ముందు రేటింగ్ బాగుంటుందని అంతా కూడా ఆశిస్తున్నారు.