ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ 2, బ్రహ్మాస్త్ర ఈ ఏడాది విడుదలైన ఈ భారీ బడ్జెట్ చిత్రాలు దేశావ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి భారీ వసూళ్లను సాధించాయి. మరి ఈ మూడు సినిమాల్లో ఫస్ట్ వీకెండ్లో కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టిన చిత్రమేంటే తెలుసా?ఇక ఈ ఏడాది ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ 2, బ్రహ్మాస్త్రం.. భారీ బడ్జెట్ సినిమాలుగా రిలీజై బాక్సాఫీస్ ముందు అదరగొట్టాయి. మంచి టాక్‌ను తెచ్చుకున్నాయి. అయితే అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కించిన 'బ్రహ్మాస్త్రం' వీకెండ్ వరకూ వసూళ్లు బాగానే ఉన్నా, ఆ తర్వాత నుంచి కలెక్షన్ల జోరు కాస్త తగ్గింది.ఈ క్రమంలో ఈ ఏడాది ఫస్ట్ వీకెండ్లో కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టిన చిత్రం ఏదంటూ సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్, కేజీయఫ్2, 'బ్రహ్మాస్త్రం' చిత్రాల కలెక్షన్లు పోల్చి చూస్తున్నారు.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 'బ్రహ్మాస్త్రం' వీకెండ్ కలెక్షన్ మొత్తం రూ.205 కోట్ల వసూలు చేసింది.కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం 'కేజీయఫ్2'. తొలి వారం ఈ చిత్రం అన్ని భాషల్లో కలిపి 250 కోట్ల వసూలు చేసింది. తొలి భాగంతో పోలిస్తే, రెండో భాాగంపై భారీ అంచనాలు ఉండటంతో ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇక ఈ ఏడాది విడుదలైన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పీరియాడిక్ ఎపిక్ యాక్షన్ డ్రామా ఇది. 'బాహుబలి' చిత్రాల తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రం కావడం, ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాకు మొదటి నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ పాన్ ఇండియా మూవీగా దీన్ని విడుదల చేశారు. దేశవ్యాప్తంగా తొలి వీకెండ్‌కు కేవలం హిందీ వెర్షన్ రూ.75.57 కోట్లు వసూలు చేయగా మొత్తంగా రూ.300 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ లాంగ్ రన్ లో మాత్రం కేజీఎఫ్ 2 విన్నర్ గా నిలిచింది.