భర్త పాడేను మోసిన కృష్ణంరాజు భార్య.....!!!
ప్రభుత్వ లాంఛనాలతో మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో కృష్ణంరాజు గారి అంత్యక్రియలను నిర్వహించారు. కృష్ణంరాజుని చివరిచూపు చూసుకోవడం కోసం అభిమానులు చాలామంది వచ్చారు. అయితే కేవలం కుటుంబసభ్యులు మరియు బంధుమిత్రులను మాత్రమే ఫామ్‌హౌస్‌లోకి అనుమతించారు. ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ఉండడానికి కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే అనుమతించామని పోలీసులు చెప్పారు .
కృష్ణంరాజు గారి మరణాన్ని కుటుంబసభ్యులు తట్టుకోలేకపోతున్నారు. ఆయన భార్య, కూతుళ్లతో పాటు ప్రభాస్ కూడా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేశారు. కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి అయితే తన భర్త పాడెను మోసి అతడిపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు . ఆ దృశ్యాలు గుండెబరువెక్కే విధంగా ఉన్నాయి. సెలబ్రిటీలందరూ కూడా కృష్ణంరాజుకి నివాళులు అర్పించారు.అలాగే సినిమా సెట్స్ లో కూడా కృష్ణంరాజుకి శ్రద్ధాంజలి ఘటించారు.
మెగాస్టార్ చిరంజీవి తన సినిమా సెట్స్ లో కృష్ణంరాజు ఫొటో ఏర్పాటు చేసి.. తన టీమ్ తో కలిసి మరోసారి నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవిగారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే సంచలన దర్శకుడు అయినటువంటి ఆర్జీవీ షూటింగ్స్ ఆపేసి కృష్ణంరాజుకి నివాళులు అర్పించాలంటూ పోస్ట్ పెట్టారు.