తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో అదిరి పోయే క్రేజ్ ఉన్న
యువ హీరోలలో ఒకరు అయిన
నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో విజయవంతమైన
మూవీ లలో నటించిన
నాగ చైతన్య తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు.
జోష్ మూవీ తో
వెండి తెరకు పరిచయం అయిన
నాగ చైతన్య మొదటి
మూవీ తోనే బాక్సా ఫీస్ దగ్గర విజయాన్ని సాధించలేక పోయినప్పటికీ తన నటనతో ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు.
ఇది ఇలా ఉంటే ఇప్పటికే
నాగ చైతన్య ఈ సంవత్సరం బంగార్రాజు , థాంక్యూ , లాల్ సింగ్ చడ్డా మూడు
మూవీ లలో నటించాడు. ఈ మూడు
మూవీ లలో బంగార్రాజు
మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
నాగ చైతన్య 'దూత' వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.
విక్రమ్ కే
కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్
అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే వెంకట్ ప్రభు దర్శకత్వంలో కూడా
నాగ చైతన్య ఒక మూవీలో నటించబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలుబడింది. కృతి శెట్టి ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా
ఇళయరాజా , యువన్ శంకర్రాజ ఈ క్రేజీ
మూవీ కి సంగీతాన్ని అందించనున్నారు. అలాగే వేణు ఉడుగుల దర్శకత్వంలో కూడా
నాగ చైతన్య ఒక సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే
పరుశురామ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించడానికి
నాగ చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇలా
నాగ చైతన్య ప్రస్తుతం అదిరి పోయే సినిమాల లైనప్ ని సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.