అందాల ముద్దు గుమ్మ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ సవ్యసాచి మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మ మిస్టర్ మజ్ను మూవీ లో హీరోయిన్ గా నటించింది. సవ్యసాచి మరియు మిస్టర్ మజ్ను సినిమాలు రెండు కూడా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.
అయినప్పటికీ ఈ ముద్దు గుమ్మ తన అందచందాలతో , నటనతో ఎంత మంది ప్రేక్షకుల మనసు దోచుకోవడంతో నిధి అగర్వాల్ కి ఆ తర్వాత కూడా క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈస్మార్ట్ శంకర్ మూవీ లో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ ఈ మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.
ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన హీరో మూవీ లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది. ఈ మూవీ కనక మంచి విజయం సాధించినట్లు అయితే నిధి అగర్వాల్ క్రేజ్ అమాంతం పెరిగే అవకాశం ఉంది.
ఇది ఇలా ఉంటే తాజాగా సైమా అవార్డు ఫంక్షన్స్ జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ అవార్డు ఫంక్షన్ ని సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా నిధి అగర్వాల్ కు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో సైమా అవార్డ్ ఫంక్షన్ కే గ్లామర్ ని తెచ్చే విధంగా ఉంది.