బాలయ్య మూడ్ కు అరవింద స్వామి నిలబడగలడా !
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ మసాలా మూవీని చేస్తున్న బాలకృష్ణ ఈమూవీ షూటింగ్ చివరి దశలో ఉన్నాడు. ఈ నెలాఖరకు ఈమూవీ షూటింగ్ ను పూర్తి చేసి వచ్చేనెల నుండి అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ వైపు బాలయ్య వెళ్ళబోతున్నాడు. ఇప్పుడు ఈమూవీకి సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో అనేక చర్చలకు అవకాశాన్ని ఇస్తోంది.
ఈమూవీలో పూర్తి అహంతో ఉండే ఒక నెగిటివ్ పాత్రకు అరవింద్ స్వామిని అడగడం జరిగిందట. తెలుస్తున్న సమాచారంమేరకు ఈ విలక్షణ నటుడు ఈమూవీలో నటించడానికి తన అంగీకారాన్ని తెలియచేస్తూ తన పాత్ర పరిధి హీరో పాత్రతో సమానంగా ఉండాలని కండిషన్ పెట్టినట్లు టాక్. వాస్తవానికి బాలకృష్ణ తన తోటి నటీనటులతో చాల మర్యాదగా ఉంటారు. అయితే అప్పుడప్పుడు బాలయ్యకు మారే మూడ్ వల్ల అతడితో నటించే కీలక నటీనటులకు అప్పుడప్పుడు సమస్యలు వస్తాయి అని అంటారు.
ఒకవైపు అరవింద్ స్వామి కూడ చాల మూడీ పర్సన్ అతడికి అతడు నటించే సినిమాల దర్శకులతో భేదాభిప్రాయాలు వస్తే ఆ దర్శకుడుకి చెప్పకుండా తాను ఉండే హోటల్ ను ఖాళీ చేసి చెన్నై వెళ్ళిపోతూ ఉంటాడు. దీనికితోడు హీరోల డేట్స్ కు తగ్గట్టుగా అరవింద్ స్వామి తన డేట్స్ ను సరిచేసుకోడు అన్న అపవాదు కూడ ఉంది. దీనితో ఇద్దరు మూడీ స్టార్స్ ను అనీల్ రావిపూడి ఎంతవరకు హ్యాండిల్ చేయగలడు అంటూ ఇండస్ట్రీలోని కొందరి కామెంట్స్..