సినిమా
ఇండస్ట్రీ లోకి ఎంతోమంది ముద్దుగుమ్మలు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమందికి మాత్రమే మొదటి మూవీతో మంచి క్రేజ్ లభిస్తూ ఉంటుంది. అలా తెలుగు
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి
మూవీ తోనే అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దుగుమ్మలలో
శ్రీ లీల ఒకరు.
శ్రీ లీల ,
శ్రీకాంత్ తనయుడు
రోషన్ హీరోగా పెరకెక్కిన
పెళ్లి సందD
మూవీ తో తెలుగు
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.
మొదటి
మూవీ లోనే ఈ ముద్దుగుమ్మ తన నటనతో , అంతకుమించిన అందచందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. దానితో
పెళ్లి సందD
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించకపోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం భారీ క్రేజీ
మూవీ లలో అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం
శ్రీ లీల ,
మాస్ మహారాజా
రవితేజ హీరోగా త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా
మూవీ లో
రవితేజ సరసన
హీరోయిన్ గా నటిస్తోంది. ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
అలాగే మరి కొన్ని
మూవీ లలో కూడా ఈ ముద్దుగుమ్మ
హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న
శ్రీ లీల సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను కూడా అప్పుడప్పుడు తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా
శ్రీ లీల తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో
శ్రీ లీల మెరూన్ కలర్ లో ఉన్న క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని అంతే డీసెంట్ మరియు క్లాస్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటింట ఫుల్ వైరల్ అవుతున్నాయి.