నాగ చైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తేరకెక్కిన ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి , మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అంతకు మించిన క్రేజ్ ను సంపాదించు కొని , ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస అవకాశాలను దక్కించుకొని , అతి తక్కువ కాలం లోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఎదిగిపోయిన ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారా అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న సమంత ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీ లో కూడా అనేక మూవీ లలో హీరోయిన్ గా నటించి అక్కడే ప్రేక్షకులను కూడా ఎంత గానో అలరించింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం సమంత 'ఫ్యామిలీ మాన్' సీజన్ 2 వెబ్ సిరీస్ ద్వారా హిందీ ప్రేక్షకులను కూడా బాగానే అలరించింది. అలాగే పుష్ప ది రైస్ మూవీ లోని స్పెషల్ సాంగ్ తో సమంత ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకుంది.
ఇలా ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్న సమంత , తాప్సి బ్యానర్ లో తేరకెక్కపోయే మూవీ ద్వారా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ అనేక వార్తలు కొన్ని రోజుల క్రితం బయటికి వచ్చాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సమంత , తాప్సి బ్యానర్ లో తెరకెక్కేబోయే మూవీ ద్వారా కాకుండా మరో ఇతర మూవీ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి సమంత , తాప్సి బ్యానర్ లో తెరకెక్కే మూవీ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇస్తుందా ... లేక ఇతర మూవీ తో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తుందో చూడాలి.