బిగ్ బాస్ 6 : చివరి నిమిషంలో తప్పుకున్న ఉదయభాను.. కారణం ఇదేనా?

praveen
తెలుగు ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రారంభమైంది. ఎంటర్టైన్మెంట్ పెంచడం మొదలు పెట్టింది. ఈసారి ఎంతో మంది ప్రేక్షకులకు తెలిసిన సెలబ్రిటిలే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు అని చెప్పాలి.  అయితే బిగ్ బాస్ ఆరో సీజన్ కు సంబంధించిన ప్రకటన వచ్చిన నాటి నుంచి సోషల్ మీడియాలో ఎన్నో పేర్లు వైరల్ గా మారిపోయాయ్. ఇలా వైరల్ గా మారిపోయిన వారిలో కొంతమంది నిజంగానే కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. మరి కొంత మంది పేర్లు మాత్రం కేవలం పుకార్లు మాత్రమే అన్న విషయం తేలిపోయింది.


 ముఖ్యంగా ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్గా ఏకచ్ఛత్రాధిపత్యానికి నడిపించిన ఉదయభాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతుంది తద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ కు దారులు వేసుకో బోతుంది.  ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా వెళ్లడానికి ఉదయభాను కు భారీగా రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారు అంటూ వార్తలు వైరల్ గా మారిపోయాయి. ఇలా ఉదయభాను బిగ్ బాస్ ఎంట్రీ గురించి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఫేక్ అని తేలిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అందరూ అనుకున్నట్టుగానే బిగ్బాస్ నిర్వాహకులు ఉదయభానుని కంటెస్టెంట్ గా రావాలని సంప్రదించారట.


 ఈ క్రమంలోనే ఉదయభాను భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో పాటు భారీ కండిషన్స్ పెట్టిందట. దీంతో ఇక నిర్వాహకులు కూడా ఉదయభానుని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడం విషయాన్ని లైట్ తీసుకున్నారని వార్త వైరల్ గా మారిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో ఈమె ఎంట్రీ ఉంటుందని అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో తప్పకుంది అన్న వార్తలు కూడా వినిపించాయి. వారానికి నాలుగు లక్షలు డిమాండ్ చేసిందట ఉదయభాను. అయితే అంత పెద్ద మొత్తంలో చెల్లించలేమని నిర్వాహకులు చెప్పారట. తద్వారా ఉదయభాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళకుండా తప్పుకుంది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: