సింహాసనం రీ రిలీజ్ వెనుక మహేష్ !
1987 ప్రాంతాలలో వచ్చిన ‘సింహాసనం’ ఒక చరిత్ర. తెలుగు సినిమాలలో ప్రయోగాలకు చిరునామాగా ఉండే సూపర్ స్టార్ కృష్ణ స్వయంగా దర్శకత్వం వహించి విడుదల చేసిన ఈభారీ జానపద సినిమా అప్పట్లో టెక్నికల్ గా చాల ఉన్నత స్థాయిలో నిర్మించబడినప్పటికీ ఆసినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
అప్పటికీ చిరంజీవి మెగా స్టార్ గా బాగా సెటిల్ అయిపోవడంతో చిరంజీవి మాస్ స్టెప్స్ కు అలవాటు పడ్డ ఆనాటి యూత్ ప్రేక్షకులు ‘సింహాసనం’ మూవీని శ్రద్దగా అలరించలేదు. అయితే ఆమూవీ ఆతరువాత ఎన్నిసార్లు టీవీ లలో వచ్చినా జనం బాగా చూశారు.
ప్రస్తుతం టాప్ హీరోల అలనాటి సూపర్ హిట్ సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఆసినిమాలకు సంబంధించిన ప్రింట్స్ కు టెక్నికల్ గా 4కె 6కె టెక్నాలజీ తో వాటిని కొత్త సినిమాలు అనిపించేడట్లుగా మార్చి వాటిని రీ రిలీజ్ చేయడం ఒక ట్రెండ్ గా మారింది. ఆమధ్య మహేష్ ‘పోకిరి’ లేటెస్ట్ గా పవన్ ‘జల్సా’ సినిమాలు రీ రిలీజ్ అయినప్పుడు క్రియేట్ చేసిన రికార్డుల హంగామా తెలిసినవిషయమే.
ఇప్పుడు అదే రీతిలో అలనాటి సూపర్ స్టార్ కృష్ణ ‘సింహాసనం’ మూవీని 8కె టెక్నాలజీలో మార్చి త్వరలో రీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో సూపర్ స్టార్ కుటుంబ సభ్యులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కృష్ణకు 80 సంవత్సరాల వయసు దాటింది. ప్రస్తుతం ఆయన మహేష్ సినిమా ఫంక్షన్స్ కు కూడ రాలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ‘సింహాసనం’ మూవీని రీ రిలీజ్ చేస్తే అది ఒక చరిత్ర అవుతుందని ఆలోచేస్తున్న సూపర్ స్టార్ కుటుంబ సభ్యుల ఆలోచనల వెనుక మహేష్ ప్రోత్సహ సహకారాలు ఉన్నాయి అన్నమాటలు వినిపిస్తున్నాయి. అంచనాలకు అనుగుణంగా ఈ రీ రిలీజ్ ప్రయత్నం విజయవంతం అయితే సీనియర్ హీరోల అలనాటి బ్లాక్ బష్టర్ సినిమాలు ఇలాంటి పద్ధతి అనుసరించే ఆస్కారం ఉంది..