బాహుబలిని తలపించేలా ఉన్న పొన్నియన్ సెల్వన్ ట్రైలర్..!!
మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ హిస్టారికల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం మొదటి భాగానికి సంబంధించి ట్రైలర్ ను ఈ రోజున విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను చెన్నైలో నెహ్రూ స్టేడియంలో విడుదల చేయడం జరిగింది. హిస్టారికల్ కథాంశాన్ని తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి హీరో రానా వాయిస్ ఓవర్ తో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది ఈ కథ రాజ్యాధికారం కోసం..కిరీటం కోసం.. పోరాడుతున్న నేపథ్యంలో కథ అన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆదిత్య కరికాల నుంచి చోళ రాజ్యానికి వెళ్లిన వారి చుట్టూ ఉండే కథ అంశమే ఈ సినిమా అన్నట్లుగా ఈ ట్రైలర్ను చూస్తే మనకి అర్థమవుతోంది.
ఇక ఈ ట్రైలర్ లో విజువల్స్ గ్రాఫిక్స్ ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో సూర్య, విక్రమ్, త్రిష, జయం రవి తదితరులు ఈ సినిమాలో నటించారు. ఇక ఈ చిత్రానికి హైలైట్ గా ఐశ్వర్యరాయ్ నటన ఉండబోతున్నట్లుగా ఈ సినిమా ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా ట్రైలర్ను కమల్ హాసన్ చేతులమీదుగా.. మలయాళం లో.. పృధ్విరాజ్ సుకుమారన్ చేతులమీదుగా.. తెలుగులో దగ్గుబాటి రానా చేతులమీదుగా.. కన్నడలో జయంత్ కైకిని.. బాలీవుడ్ లో అనిల్ కపూర్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.