భారీ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న నయనతార 'గోల్డ్' మూవీ..!

Pulgam Srinivas
లేడీ సూపర్ స్టార్ నయన తార గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక తెలుగు , తమిళ సినిమా ల్లో నటించి అద్భుతమైన క్రేజ్ ని సంపాదిం చుకుంది . అలాగే నయనతార  'సైరా నరసింహా రెడ్డి' లాంటి పాన్ ఇండియా మూవీ లో కూడా హీరోయిన్ గా నటించి పాన్ ఇండియా స్థాయిలో తన క్రేజీ ను సంపాదిం చుకుంది . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నయనతార తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం లో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది .


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నయనతార ఎక్కువగా తమిళ మూవీ లలో నటిస్తూ వస్తుంది . ప్రస్తుతం నయనతార తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది . నయన తార కేవలం కమర్షియల్ మూవీ లలో మాత్రమే కాకుండా ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా నయనతార 'గోల్డ్' అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించాడు.


ఈ మూవీ సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ రన్ టైమ్ చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీ ఏకంగా 3 గంటల 10 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కి ఆల్ఫోన్స్ పుత్రెన్ దర్శకత్వం వహించాడు ఈ మూవీ ఎలాంటి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: