నటుడి గా , నిర్మాత గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు దక్కించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసారా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ కి మల్లాడి వశిష్ట దర్శకత్వం వహించగా , క్యాథరీన్ , సంయుక్త మీనన్ ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన హీరోయిన్ లుగా నటించారు .
ఈ మూవీ నుండి మూవీ యూనిట్ సినిమా విడుదలకు ముందు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడం తో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టు కున్నారు . అలా మంచి అంచనాల నడుమ ఆగస్టు 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ ను బాక్సా ఫీస్ దగ్గర అందు కొని అదిరి పోయే కలెక్షన్ లను కూడా బాక్సా ఫీస్ దగ్గర కొల్ల గొట్టింది .
ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న బింబిసార మూవీ మరి కొన్ని రోజుల్లోనే 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. బింబిసార మూవీ ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయినటువంటి జీ 5 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో మరి కొన్ని రోజుల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే థియేటర్ లలో ప్రేక్షకులను అద్భుతంగా అలరించి బింబిసార మూవీ 'ఓ టి టి' ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.