అమితాబ్ తో డి గ్లామర్ రోల్ లో రష్మిక..!!

Divya
గ్లామర్ బ్యూటీ గా పేరు పొందింది హీరోయిన్ రష్మిక. ఇక ఎంతోమంది అభిమానులను అతి తక్కువ సమయంలోనే సంపాదించుకుంది. ఈ ముద్దు గుమ్మ ను అభిమానులు నేషనల్ క్రష్ అని పిలుస్తూ ఉంటారు. నిన్న మొన్నటి వరకు ఈమె సౌత్ లో హీరోయిన్ గా మాత్రమే ఉండేది. అయితే పుష్ప సినిమాతో మెల్లమెల్లగా ఈమె ఇతర భాషలలో కూడా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది ముఖ్యంగా బాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకొని పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు పొందింది. దుల్కర్ సల్మాన్ హీరోగా సీతారామం సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది రష్మిక. మరొకసారి ఈ చిత్రంలో తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
ప్రస్తుతం రష్మిక చేతిలో మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలతో పాటు పుష్ప-2, దళపతి విజయ్ తదితర సినిమాలలో నటిస్తూ ఉన్నది. తాజాగా గుడ్ బై సినిమా నుంచి ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవ్వడం జరిగింది ఈ సినిమాలో కూడా రష్మిక డి గ్లామర్ పాత్రలో నటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే పుష్ప సినిమాలో కూడా ఈమె డీ గ్లామర్ పాత్రలో నటించి పాన్ ఇండియా స్థాయిలో తన పేరును పాపులర్ అయ్యేలా చేసుకుంది. ఇప్పుడు గుడ్ బై సినిమాలో కూడా ఈమె డి గ్లామరస్ లో కనిపించడంతో ఈమె అభిమానులు ఈ సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నామని కామెంట్ చేస్తూ ఉన్నారు.


ఈ సినిమాలో బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరుపొందిన అమితాబచ్చన్ నటిస్తూ ఉన్నారు. ఇక ఈ చిత్రంలో రష్మిక కూడా ఓకే ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నది. ఇక ఈ సినిమాను వికాస్ బెహల్ దర్శకత్వం వహిస్తున్నారు ఇప్పటికీ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్నది. కేవలం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్ట్ ఓవర్ వైరల్ గా మారడమే కాకుండా అందరిని ఆసక్తి పెంచాలా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: