కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి చియాన్ విక్రమ్ తాజాగా కోబ్రా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించగా శ్రీ నిధి శెట్టి ఈ మూవీ లో చియాన్ విక్రమ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ఆగస్టు 31 వ తేదీన మంచి అంచనాల నడుమ విడుదల అయ్యింది. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే టాక్ లభించింది.
కాక పోతే ఈ మూవీ నిడివి కాస్త ఎక్కువ అయ్యింది అనే నెగటివ్ టాక్ రావడంతో త్వరగా స్పందించిన మూవీ యూనిట్ ఈ సినిమా నుండి 20 నిమిషాలను కత్తిరించనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తెలుగు సినీ ప్రేమికులు ఈ మూవీ పై మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా తెలుగు సినీ ప్రేమికులు ఈ మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్న కారణంతో ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్సా ఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్ లు లభించాయి.
ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు 2.94 కోట్ల షేర్ , 4.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్స్ ను దక్కించుకున్న కోబ్రా మూవీ రెండో రోజు మాత్రం కలెక్షన్ లలో చాలా వరకు డ్రాప్ కనబడింది. రెండో రోజు కోబ్రా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 0.66 కోట్ల షేర్ , 1.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కోబ్రా మూవీ కలెక్షన్ లు మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు చాలా వరకు పడిపోయాయి.