ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసు.. వైష్ణవ్ తేజ్..!!

Divya
ఉప్పెన చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డమ్ అందుకున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్ తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. తాజాగా తను నటించిన రంగ రంగ వైభవంగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. అయితే తను నటించిన ఒక సినిమా ఆడక పోవడానికి గల కారణాన్ని డైరెక్టర్ ఏంటా అని అడగకముందే ఓపెన్ గా తెలియజేశాడు వైష్ణవ తేజ్. వైష్ణవి తేజ్ ఉప్పెన సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో కొండపొలం సినిమాలో నటించారు. ఇందులో రకుల్ ప్రీతిసింగ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా చూసిన వెంటనే ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందుగానే గమనించాడట.


అయితే అలా పోవడానికి కారణం డైరెక్టర్ క్రిష్ అని ఓపెన్ గా తెలియజేశారు. మొదట డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని వేరొకలాగా చేద్దామని ప్లాన్ చేసుకున్నారట. కానీ షూటింగ్ కు వెళ్లగానే క్లాసికల్ గా తెరకెక్కిస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పారట. అందుకోసమే ఫారెస్ట్ అండ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నాన్ కమర్షియల్ గా చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. కానీ షూటింగ్లో ఫుల్ ఎంజాయ్ చేశామని కూడా తెలియజేశారు వైష్ణవి తేజ్. కానీ ఫైనల్ గా ఈ సినిమాను చూశాక పెద్దగా వర్కౌట్ కాదని తనకు అనిపించిందని తెలిపారు.



అలా అప్పటి విషయాన్ని ఇప్పుడు అందరి ముందు మొహమాటం లేకుండా పంచుకున్నారు వైష్ణవి తేజ్. ఇక తాజాగా తను నటించిన రంగ రంగ వైభవంగా సినిమా ప్రేక్షకులను కచ్చితంగా కడుపుబ్బ నవ్విస్తుందని నమ్మకం తనకు ఉందని ఇక ఈ సినిమా కచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని కూడా తెలియజేశారు. ఇక ఇందులో హీరోయిన్ గా కేతిక శర్మ నటించినది. ఏది ఏమైనా ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే లాగా ఉండడంతో మరి ఈసారైనా వైష్ణవతే సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: