నరేష్ ఐ లవ్ యు చెప్తే ఫిదా అయిన హీరోయిన్.. హగ్ కూడా ఇచ్చిందిగా ?

praveen
ఇటీవలికాలంలో వెండితెరపై ఏ సినిమా విడుదలైన కూడా విడుదలకు ముందు బుల్లితెరపై సందడి ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి.  అదేనండి ప్రమోషన్స్ సందడి.  ప్రతి సినిమాకి ప్రమోషన్ ఎంతో ముఖ్యం. సినిమా ప్రేక్షకుల్లో కి వెళ్లాలంటే ప్రమోషన్స్ కూడా అంత గట్టిగా నిర్వహించాలి. ఈ క్రమంలోనే సినిమా కోసం ఎంత కష్ట పడుతున్నారో..   ప్రమోషన్స్ కోసం కూడా హీరో హీరోయిన్లతో పాటు దర్శకనిర్మాతలు అంతే కష్టపడుతున్నారు. ప్రమోషన్స్ కోసం కూడా కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్న వారు చాలా మంది ఉన్నారు అని చెప్పాలి.


 బుల్లితెరపై బాగా పాపులర్ టీవీ సంపాదించుకున్న  కార్యక్రమాలలో  ఇక చిత్ర బృందం ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. కాగా ప్రస్తుతం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన రంగ రంగ వైభవంగా సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  ఈ క్రమంలోనే ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్స్ లో  భాగంగా బిజీగా ఉంది చిత్రబృందం.   కాగా  ఇటీవలే ఎంతో పాపులారిటీ సంపాదించిన బుల్లితెర కార్యక్రమం  ఎక్స్ ట్రా జబర్దస్త్ లో ప్రమోషన్స్ కోసం వచ్చింది అంగరంగ వైభవంగా చిత్రబృందం. ఇటీవలే విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఇక ఈ ప్రోమో ఎప్పటిలాగానే ఎంతో సందడి సందడిగా సాగిపోయింది అనే చెప్పాలి. జబర్దస్త్ కమెడియన్స్ వేసిన పంచ్ లను  అటు హీరో వైష్ణవ తేజ్ హీరోయిన్ కేతికశర్మ ఎంతగానో ఎంజాయ్ చేశారు. అయితే కేతిక  శర్మ ని చూసిన జబర్దస్త్ కమెడియన్స్ మైమరచిపోయారూ.  ఈ క్రమంలోనే వరుసగా హీరోయిన్ కు ప్రపోస్  చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే  జబర్దస్త్ నరేష్ ఇష్టపడిన షబీనా  తన ప్రియుడిని తీసుకుని జబర్దస్త్ స్టేజి మీదికి వస్తుంది. దీంతో షబీనా పోతే ఏంటి నాకు కేతిక  ఉంది అంటూ ఐ లవ్ యు కేతిక అంటూ హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు నరేష్. ఇక అతని ప్రపోజల్ కి ఫిదా అయిపోయిన హీరోయిన్ స్టేజి మీదికి వెళ్లి మరి అతనికి హగ్  ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: