బిగ్ బాస్ సీజన్ 6 నుంచి ఫస్ట్ గ్లింప్.. ఈసారి సెటప్ ఓ రేంజ్ లో..!!
ఇకపోతే బిగ్ బాస్ 6 హౌస్ లోకి ఎవరెవరు కంటెస్టెంట్ గా రాబోతున్నారు అని లిస్టు కూడా ఫైనల్ అయింది. అలాగే హౌస్ లోకి వెళ్లే వారిని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు గ్రాండ్గా ఎంట్రీ ఈవెంట్ ను కూడా నిర్వహించనున్నారు. ఇక వినాయక చవితి సందర్భంగా ఇందుకు సంబంధించిన ఫస్ట్ గ్లింపును కూడా విడుదల చేసి మరింత వినోదాన్ని పంచే ప్రయత్నం చేసింది బిగ్ బాస్.. జీవితంలో ఏ మూమెంట్ అయినా సరే బిగ్ బాస్ తర్వాతే.. అంటూ నాగార్జున చెప్పడంతోనే ఈ ఫస్ట్ గ్లింప్ మొదలవుతుంది. ఇక ఈ వీడియోలో బిగ్ బాస్ హౌస్ సెట్ అప్ ను కూడా చూపించడం జరిగింది. ఇక అలాగే లాంచ్ ఈవెంట్ కి సంబంధించిన విజువల్స్ తో పాటు అస్పష్టంగా కొంతమంది కంటెస్టెంట్లను ఇందులో మనం చూడవచ్చు.
అంతేకాదు ఇందులో కమలహాసన్ విక్రమ్ మూవీ డైలాగులను కూడా ఉపయోగించారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ గ్లింప్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక సెప్టెంబర్ 4వ తేదీ నుంచి తెలుగులో బిగ్ బాస్ సరికొత్త సీజన్ ప్రారంభం కాబోతోంది.
.