బుచ్చిబాబు మూవీలో ద్విపాత్రాభినయం లో కనిపించనున్న ఎన్టీఆర్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . జూనియర్ ఎన్టీఆర్ ఈ సంవత్సరం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ను తెచ్చు కున్నాడు . ఆర్ ఆర్ ఆర్ మూవీ కి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించ గా , ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరో గా నటించాడు .

ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ మరి కొద్ది రోజుల్లో కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో హీరోగా నటించబో తున్నాడు . ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది . ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్క బోయే మూవీ లో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది.

ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ 'ఉప్పెన' మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో తేరక్కపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: