NBK 107:
టాలీవుడ్ ప్రముఖ సీనియర్
హీరో హీరో నందమూరి నట సింహం
బాలకృష్ణ నటిస్తున్న తాజా
మూవీ ఎన్బీకే 107. ప్రస్తుతం ఈ
సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా
బాలయ్య, శ్రుతిహాసన్‌తో
డైరెక్టర్ గోపీచంద్ కలిసి దిగిన ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బోయపాటి శ్రీనుతో ఇటీవల చేసిన 'అఖండ' వంటి
బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత
హీరో బాలకృష్ణ..
మాస్ డైరెక్టర్ "క్రాక్" సినిమాతో
బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేనితో 'ఎన్బీకే 107'
మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ
సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ
సినిమా విడుదల ఎప్పుడవుతుందా అని అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో
డైరెక్టర్ గోపీచంద్ మలినేని పోస్ట్ చేసిన ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సెల్ఫీలో
బాలకృష్ణ అదిరిపోయే లుక్‌లో కనిపించారు.
హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా బ్లాక్ అవుట్‌ఫిట్‌లో తన అందంతో ఆకట్టుకుంటున్నారు.బాలయ్య కథానాయకుడిగా మైత్రీ
మూవీ మేకర్స్ పతాకంపై ఈ
సినిమా రూపొందుతోంది. దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
బాలకృష్ణ ఈ చిత్రంలో రెండు కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తుండగా, సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రచిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను
దసరా కానుకగా విడుదల చేయనున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో ఎన్నో భారీ అంచనాలు వున్నాయి. మరి ఈ
సినిమా బాల
కృష్ణ కి ఎలాంటి
బ్లాక్ బస్టర్ ఇస్తుందో చూడాలి.హిట్ కాస్ట్ కావడంతో ఖచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.