డార్లింగ్ ప్రభాస్ ఎందుకిలా చేస్తున్నాడు... ఫ్యాన్స్ బేజారు ?

VAMSI
టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుండి తాకంటూ సెపరేట్ స్టైల్ ను మైంటైన్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక బాహుబలి సిరీస్ తర్వాత అయితే ఇతని రేంజ్ వరల్డ్ కు పాకింది. దీనితో ఇండియాలోని డైరెక్టర్స్ అంతా ఇతనితో సినిమాలు చేయడానికి ఎంతగానో ఎదురుచూశారు. బాహుబలి తర్వాత హిట్ కోసం  ప్రభాస్ ఇంకా వెయిటింగ్. వరుసగా సాహో మరియు రాధే శ్యామ్ ల దెబ్బతో ఫ్యాన్స్ కూడా ఢీలా పడిపోయారు. దానితో ప్రభాస్ నుండి వచ్చే తర్వాత సినిమాలపై ప్రత్యేక దృష్టి పడింది.

కాగా గత మూడు సంవత్సరాలుగా ఆదిపురుష్ అనే సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. కానీ ఇంకా ఈ సినిమా నుండి అప్డేట్ ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. కానీ ఎప్పుడూ ఏ అప్డేట్ లేకుండా ప్రభాస్ ఫ్యాన్స్ ను బోర్ కొట్టిస్తున్నారు. ఈ సినిమా ఒక ఇతిహాసంగా తెరకెక్కుతోంది. రామాయణం ను బేస్ చేసుకుని చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా మరియు కృతి సనన్ సీతగా నటిస్తోంది. ఇంకా కొందరు నటీనటులు మిగిలిన పాత్రలలో ఈ సినిమాలో భాగం అయ్యారు. అయితే ఈ సినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడేది ఎప్పుడు అన్నది ఇంకా తెలియలేదు. పైగా ఈ సినిమా నుండి సరైన అప్డేట్స్ కూడా లేవు.

కానీ వీరి బాధ ఏమిటంటే సినిమా విడుదలకు ముందు కనీసం... ఫోటోలు, వీడియోస్ లాంటివి విడుదల చేస్తే ఫ్యాన్స్ కు సంతోషంగా ఉంటుంది. అయితే ఈ సినిమా పట్ల ఏ విధమైన సంతోషం లేకుండా డైరెక్టర్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్ కు తీరని అన్యాయం చేస్తున్నారు. ఇలాగే చేస్తే రాధే శ్యామ్ నిర్మాత డైరెక్టర్ లపై ఏ విధంగా స్పందించారో అదే రిపీట్ అయ్యేలా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: