బాహుబలి సిరీస్ తో ఒక్కసారిగా పాన్ ఇండియ హీరోగా మారారు యంగ్
రెబల్ స్టార్ ప్రభాస్. అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు డార్లింగ్‌గా ఉన్న ప్రభాస్
బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ హీరోగా మారారు.దీంతో ఈ యంగ్ రెబల్ స్టార్ స్టామినా ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ప్రభాస్ నుంచి కొత్త వస్తుందంటే చాలు అది
ఇండియా వ్యాప్తంగా వార్తగా మారే పరిస్థితి వచ్చింది.
బాహుబలి తర్వాత సాహో, రాదేశ్యామ్ చిత్రాలతో ఆకట్టుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస లను లైన్‌లో పెడుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ లను పట్టాలెక్కిస్తూ బిజీ బిజీగా వున్నారు.ఇప్పటికే
kgf డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సలార్, ఓం రౌత్‌తో ఆదిపురుష్, సందీప్ వంగతో స్పిరిట్.. ఇలా మూడు లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డార్లింగ్ తాజాగా
మారుతి కు కూడా ఓకే చెప్పేశాడు. మొదట్లో ప్రభాస్-మారుతి పై వచ్చిన వార్తలను ఎవ్వరూ నమ్మలేదు. కానీ తర్వాత వచ్చిన ప్రకటనల నేపథ్యంలో వీరి కాంబినేషన్ కాన్ఫామ్ అయినట్లు తెలిసింది.
ఇందులో భాగంగానే తాజాగా ఈ
పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. నవంబర్ నుంచి సెట్స్ మీదికి ఈ ను తీసుకెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ప్రభాస్ ఫ్యాన్స్‌ను
ఖుషీ చేస్తున్నాయి.డైరెక్టర్
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ హారర్
కామెడీ కథాంశంతో తెరకెక్కించనున్నట్లు సమాచారాం. ప్రభాస్ కెరీర్‌లోనే ఇలాంటి నేపథ్యంలో వస్తోన్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఇక ఇందులో డార్లింగ్ జోడిగా ఏకంగా నలుగురు హీరోయిన్లు నటించనున్నారనది మరో వార్త. అలాగే ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ దెయ్యం పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇక లో యాక్షన్ సన్నివేశాలతో పాటు,
మారుతి మార్క్
కామెడీ కూడా ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ వార్తలపై పూర్తి క్లారిటీ రావాలంటే కు సంబంధించి అధికారిక ప్రటకన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.