కథను నమ్మితే కాసుల వర్షం కురుస్తుంది.. పరుచూరి గోపాలకృష్ణ ..!

Divya
ఇటీవల కళ్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు వసిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బింబిసార.  ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలై భారీ వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఇక తాజాగా పరుచూరి పాఠాలు కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..  గతంలో కళ్యాణ్ రామ్ కి రెండు సినిమా కథలు రాశాము.. కానీ ఆయనకు మేము హిట్ ఇవ్వలేకపోయాము.  ఎన్టీఆర్ మాదిరిగానే తను కూడా మాతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు.. ఇక ఈ సినిమా చూసిన తర్వాత కళ్యాణ్ రామ్ ఒక రిస్క్ తో కూడిన ప్రాజెక్టు చేశాడు అనిపించింది. ఇక ఒక కాలంలో ఏ పాప ప్రాణాలనైతే హీరో తీశాడో..  మరో కాలంలో ఆ పాపను బ్రతికించడం కోసం హీరో తన ప్రాణాలను ఇవ్వడమే ఈ కథలోని ఆత్మ .. పాతాళభైరవి సినిమాలోని అంశం నుంచి కూడా దర్శకుడు స్ఫూర్తిని పొందినట్లుగా నాకు అనిపించింది.
ఇక రూ. 40 కోట్ల బడ్జెట్ తో  ఒక కొత్త దర్శకుడు తో నిజంగానే కళ్యాణ్ రామ్ రిస్క్ చేశాడు.  ఇక ఇది మామూలు విషయం అసలు కాదు.  కళ్యాణ్ రామ్ కథను నమ్మాడు.. దర్శకుడిని నమ్మాడు..  అందుకే ఈ సినిమా అంతగా విజయవంతం అయింది.  విడుదలైన ప్రతి చోటా కూడా కాసుల వర్షాన్ని కురిపించింది.. ఇందులో ఇద్దరు కథానాయకులు ఉన్నప్పటికీ కథకు ఎంతవరకు అవసరమో వాళ్ళ పాత్రలను అంతవరకు మాత్రమే ఉపయోగించుకోవడం జరిగింది.. దర్శకుడు వశిష్ట స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేశాడు.. ఇక ఈ సినిమా మొదటి భాగం అంతా కళ్యాణ్ రామ్ విలన్ గానే కనిపిస్తాడు. సెకండ్ హాఫ్ లో విలన్ షేడ్స్ తొలగిపోయి అతనిలో మంచి మార్పు అనేది.. ఎప్పుడు ఎక్కడి నుంచి మొదలైంది అనే విషయం చాలా చక్కగా చూపించారు.
ఇక సంజీవని పుష్పంతో బింబిసారుడిని బ్రతికించడంతో సెకండ్ పార్ట్ మొదలవుతుందని నేను అనుకుంటున్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికైతే హీరో కథను నమ్మినప్పుడే ఖచ్చితంగా కాసుల వర్షం కురుస్తుంది అంటూ పరుచూరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: