నాగార్జున 'ది ఘోస్ట్' మూవీ ట్రైలర్ కి 24 గంటల్లో అదిరిపోయే రెస్పాన్స్..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ దర్శకులలో ఒకరు అయిన ప్రవీణ్ సత్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన ది ఘోస్ట్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని దసరా సందర్భంగా అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.


ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ చిత్రం బృందం ఈ సినిమా నుండి తాజాగా ట్రైలర్ ని విడుదల చేసింది. ఈ ట్రైలర్ అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో , పాటు ఈ మూవీ పై ఉన్న అంచనాలను కూడా ఈ సినిమా ట్రైలర్ పెంచేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ని సరిగ్గా గమనించినట్లు అయితే ఈ మూవీ లో అద్భుతమైన యాక్షన్ సన్నీవేషాలు ఉండేలా కనిపిస్తోంది.


ఇది ఇలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ అత్యంత ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 4.85 మిలియన్ వ్యూస్ ని , 180.8 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే ది ఘోస్ట్ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం బంగార్రాజు మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న నాగార్జున 'ది ఘోస్ట్' మూవీ తో ఏ రేంజ్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: