అందాల ముద్దు గుమ్మ ఆలియా భట్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . బాలీవుడ్ మూవీ ల ద్వారా కెరియర్ ని మొదలు పెట్టి అద్భుత మైన క్రేజ్ ను సంపాదించు కున్న ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ అనే తెలుగు మూవీ లో నటించింది.
ఈ మూవీ ద్వారా ఆలియా భట్ గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకుంది .
ఈ మూవీ కి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ లో హీరోలుగా నటించారు . ఈ మూవీ లో అలియా భట్ , రామ్ చరణ్ కి జోడిగా నటించింది . ఈ మూవీ తో పాటు ఆలియా భట్ కొంత కాలం క్రితం గంగుబాయి కతీయవాడి అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది . ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది . ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న ఆలియా భట్ తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది .
వరుస మూవీ లలో నటిస్తూ వస్తున్న ఈ ముద్దు గుమ్మ తన ఖాతాలో ఎంత డబ్బు ఉందో మాత్రం తనకు తెలియదు అని చెప్పు కొచ్చింది . అలాగే భారీ మొత్తంలో తన ఖాతాలో డబ్బు ఉండవచ్చు అని చెప్పు కొచ్చింది. తను కేవలం మూవీ లను మాత్రమే పట్టించుకుంటాను అని , వచ్చే డబ్బు నిర్వహణపై దృష్టి పెట్టను అని చెప్పు కొచ్చింది. మొదటి నుంచి కూడా డబ్బుకు సంబంధించిన వ్యవహారాలన్నీ అమ్మే చూసుకుంటుంది అని ఆలియా భట్ తాజాగా తెలియజేసింది.