ఓటిటిలోకి విక్రాంత్ రోణ.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..!!

Divya
ఈమధ్య కాలంలో థియేటర్లో విడుదలైన చాలా సినిమాలు కేవలం రెండు మూడు నెలల లోపే ఓటీటీ లోకి వచ్చి సందడి చేస్తున్న విషయం తెలిసిందే.  ఇక ఈ నేపథ్యంలోనే కన్నడ నటుడు కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా చిత్రం విక్రాంత్ రోణ.. రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా గత నెలాఖరులో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి మంచి హిట్ టాకును సొంతం చేసుకుంది. ఇక త్వరలోనే ఓటీటీ వేదికగా రావడానికి సిద్ధమయింది ఈ సినిమా. ఇక ఈ క్రమంలోనే ప్రముఖ ఓటిటి సంస్థ Zee 5 వేదికగా వచ్చేనెల అనగా సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ సినిమా ప్రసారం కానుంది.

ఇకపోతే ఇదే విషయాన్ని తెలియజేస్తూ ప్రముఖ ఓటీటీ సంస్థ Zee 5 ఒక వీడియోను కూడా షేర్ చేసింది. అయితే కన్నడ తో పాటు ఇతర భాషల్లో కూడా అందుబాటులో ఉందా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కొమరట్టు అనే ఊరిలో ఒక పాడు పడ్డ ఇంట్లో ఒక బ్రహ్మ రాక్షసుడు ఉంటున్నాడు అనేది అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. అయితే ఆ ఇంటి ఆవరణలో ఉన్న బావిలో ఒకరోజు ఆ ఊరి ఇన్స్పెక్టర్ శవం దొరుకుతుంది. ఇక ఆ హత్య కేసు చేదించి,  నేరస్తులను పట్టుకోవడం కోసం విక్రాంత్ రోణ  రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలోనే ఆ ఊరిలో అప్పటికే పదుల సంఖ్యల పిల్లల హత్యకు గురైనట్లు తెలుసుకుంటాడు. మరి వాళ్ళ మరణాలకు , పోలీస్ హత్య కు వున్న  సంబంధం ఏమిటి? అంతేకాదు కేసుకు విక్రాంత్ వ్యక్తిగత జీవితానికి ఉన్న లింక్ ఏంటి?  అసలు ఆ ఊర్లో ఉన్న బ్రహ్మ రాక్షసుడు ఎవడు?  అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.

జూలై 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లు రాబట్టి సుమారుగా నిర్మాతలకు రూ.50 కోట్ల లాభాన్ని అందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: