ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప ది రైజ్
మూవీ తో అద్భుతమైన విజయాన్ని పాన్
ఇండియా స్థాయిలో అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే . ఈ
మూవీ కి
సుకుమార్ దర్శకత్వం వహించ గా ,
రష్మిక మందన ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటించింది మలయాళ
ఇండస్ట్రీ లో స్టార్ నటుడి గా కొన సాగుతున్న ఫహాద్ ఫాజిల్ ఈ
మూవీ లో ప్రతి నాయకుడి పాత్ర లో నటించగా , అనసూయ, సునీల్,
రావు రమేష్ ఈ
మూవీ లో ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు . మరి కొన్ని రోజుల్లోనే పుష్ప ది రూల్
మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది . ఈ
మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి . ఇది ఇలా ఉంటే పుష్ప ది రూల్
మూవీ షూటింగ్ పూర్తి కాగానే
అల్లు అర్జున్ ,
బోయపాటి శ్రీను తో కానీ ,
కొరటాల శివ దర్శకత్వంలో కానీ తెరకెక్కబోయే
మూవీ లో నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక వార్తలు బయటకు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.
కాక పోతే
అల్లు అర్జున్ ఈ ఇద్దరు దర్శకులతో కాకుండా మరో దర్శకుడి తో
మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా సర్కారు వారి పాట
మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే
మూవీ లో
అల్లు అర్జున్ నటించబోతున్నట్లు , వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే
మూవీ మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.