RC15: ఫ్యాన్స్ కి శంకర్ నుంచి అదిరిపోయే న్యూస్ ?

Purushottham Vinay
ఇటీవలే "ఆర్ఆర్ఆర్" సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మూవీలో చెర్రీ నటనకు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేక్షకులు చాలా బాగా ఫిదా అయ్యారు.రామ్ చరణ్ నటనకు గ్లోబల్ వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. హాలీవుడ్ మేకర్స్ అయితే చరణ్ మంచి యాక్షన్ మూవీ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆ రేంజ్ లో పాపులరిటీ సంపాదించాడు రామ్ చరణ్.ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్‏తో తెరకెక్కుతున్న ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ను నిర్మిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో చరణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ శంకర్ తన ట్విట్టర్ వేదికగా ఆర్సీ 15 సినిమా అప్డేట్ ఇచ్చారు.



ప్రస్తుతం తాను కమల్ హాసన్ ఇండియన్ 2 తోపాటు రామ్ చరణ్ ఆర్సీ 15 చిత్రం కూడా షూటింగ్ చేస్తున్నాడని. రెండు సినిమాలు కూడా ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్నాయని… ఇక రామ్ చరణ్ షూటింగ్ నెక్ట్ షెడ్యూల్ త్వరలోనే హైదరబాద్, విశాఖపట్నంలో జరగనుందని తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఆర్సీ 15 తదుపరి షెడ్యూల్ స్టార్ట్ చేస్తు్న్నామంటూ ట్వీట్ చేశారు శంకర్. దీంతో చెర్రీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా సీనియర్ హీరో శ్రీకాంత్ కీలకపాత్రలో కనిపించనున్నాడు. పొలిటికల్ నేపథ్యంలో ఈ మూవీ రాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమాతో కూడా రామ్ చరణ్ రికార్డులు క్రియేట్ చెయ్యడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. శంకర్ న్యూస్ వల్ల ఫ్యాన్స్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: