హీరో నవీన్ చంద్రను.. ఆ హీరోయిన్ ఘోరంగా అవమానించిందట?
అయితే సాధారణంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎవరైనా సరే ఊహించని రీతిలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అందరి లాగానే అటు నవీన్ చంద్ర కూడా కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడట. ఇటీవలే పరంపర అనే వెబ్ సిరీస్ లో అద్భుతమైన నటనతో అందరిని మెప్పించాడు నవీన్ చంద్ర. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్లో కూడా వరుస అవకాశాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అయితే కెరీర్ మొదట్లో ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో నవీన్ చంద్ర కి అవమానం జరిగిందట.
ఫైనాన్షియల్ స్టేటస్ చూపించి మాట్లాడుతూ ఒక హీరోయిన్ నవీన్ చంద్ర ను చులకనగా చేసి మాట్లాడిందంట. అప్పట్లో మెగా హీరోలతో వరుసపెట్టి సినిమాలు చేసిన ఒక హీరోయిన్ నవీన్ చంద్ర తో కలిసి ఒక సినిమా చేసింది. అయితే సినిమా టైంలో ఆ హీరోయిన్ ఎంతో కూల్గా మర్యాదగా మాట్లాడిందట. ఒక సినిమా హిట్ అవ్వడం కోసం నవీన్ చంద్ర తో రాసుకొని పూసుకొని కూడా తిరిగిందట. ఆ తర్వాత ఈ సినిమా హిట్ అయింది. ఈ క్రమంలోనే అప్పటివరకు సినిమా కోసం రాసుకుని పూసుకుని తిరిగినా హీరోయిన్ ప్రేమ పేరుతో దగ్గరైనట్లే అయ్యి ఆ తర్వాత స్టేటస్ పేరుతో నువ్వు నా స్థాయికి తగినవి కాదు అంటూ దారుణంగా అవమానించిందట. ఇక ఆ హీరోయిన్ అలా అనేసరికి నవీన్ చంద్ర కన్నీళ్లు పెట్టుకున్నారట. అయితే ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరన్నది మాత్రం నవీన్ చంద్ర బయట పెట్టలేదు.