ఇతర దేశీలను కూడా కన్నీరు పెట్టించేలా చేసిన సినిమా ఇదే..!!

Divya
సౌత్ ఇండియన్ సినిమాలు గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతను పొందుతూ వస్తున్నాయి. ఇక అక్కడ గౌరవం కూడా గుర్తింపును కూడా మన సినిమాలు దక్కించుకుంటూ ఉన్నాయి. తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ చిత్రం బీజింగ్ ఇంటర్నేషనల్ ఫిలిమ్లో ఫెస్టివల్ లో ప్రదర్శించడం జరిగింది. ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్రేక్షకులు చూడడానికి హాజరయ్యారు ఈ సమయంలోనే ప్రేక్షకులు కొందరు జై భీమ్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చూసి కన్నీరు పెట్టుకున్న సందర్భాలు కూడా కనిపించాయట. సినిమా చాలా ఎమోషనల్ గా ఉందంటూ మరికొంతమంది అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు.


ఇక ఈ సినిమా చూసిన మరికొంతమంది ఎమోషనల్ గురించి సినిమా కథ గురించి నటీనటుల యొక్క నటన గురించి పలు విధాలుగా మాట్లాడడం జరిగింది ఇక వాటితో పాటే అభినందనలు కూడా తెలియజేశారు. జై భీమ్ థియేటర్లో రిలీజ్ కాకుండానే డైరెక్ట్ గా ఓటీటి ద్వారానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఓటీటి లో కూడా మంచి ఘనవిజయాన్ని అందుకుంది. ఇప్పుడు వివిధ భాగాలలో ను జై భీమ్ చిత్రం  కూడా అంతర్జాతీయ స్థాయిలలో అవార్డులకు నామినేట్ అవుతూ ఉండడం గమనార్హం.


ఇక ప్రముఖ అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడిన ఈ చిత్రం సూర్య ఈ సినిమాలో లాయర్ పాత్రలో కనిపించి అద్భుతంగా నటించారు. దేశంలోనే ఇప్పటివరకు కొన్ని వర్గాల వారిని మాత్రమే అత్యంత దారుణంగా చూస్తూ కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా వారికి న్యాయం జరగకుండా చూస్తూ ఉన్నారు అలాంటి వారి కథతో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది ఈ చిత్రాన్ని డైరెక్టర్ జ్ఞానబెల్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని చెప్పవచ్చు. సమాజంలో జరిగే కొన్ని సంఘటాల ఆధారంగా ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: