రాజమౌళి 'బాహుబలి' సినిమా వల్లే 'పొన్నియన్ సెల్వన్' రెండు భాగాలుగా రాబోతుంది... మణిరత్నం..!

Pulgam Srinivas
ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లలో సీక్వెల్స్ జోరు బాగా పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి ది  బిగినింగ్' 'బాహుబలి ది కంక్లూజన్' మూవీ లతో అద్భుతమైన విజయాలను పాన్ ఇండియన్ స్థాయిలో అందుకున్నాడు. దానితో ఎంతో మంది ఈ ఫార్ములాను ఫాలో అవుతూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కే జి ఎఫ్ చాప్టర్ 1' మరియు 'కే జి ఎఫ్ చాప్టర్ 2' మూవీ లను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాడు.


ఈ రెండు మూవీ లు కూడా ఒక దానిని మించి ఒకటి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. అలాగే కొంత కాలం క్రితం దర్శకుడు సుకుమార్ 'పుష్ప ది రైస్' అనే పాన్ ఇండియా మూవీ ని విడుదల చేశాడు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అందుకుంది. మరి కొన్ని రోజుల్లో ఈ మూవీ కి కొనసాగింపుగా 'పుష్ప ది రూల్' మూవీ రాబోతుంది. ఇలా బాహుబలి ఇచ్చిన జోష్ లో ఎంతో మంది దర్శకులు పాన్ ఇండియా రేంజ్ లో సీక్వెల్ గా మూవీ లను తెరకెక్కిస్తే వస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇండియా లోనే గ్రేట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మణిరత్నం ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతుంది.


మొదటి భాగం ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల కాబోతోంది. తాజాగా దర్శకుడు మణిరత్నం మాట్లాడుతూ ... రాజమౌళి 'బాహుబలి' వల్లే వరల్డ్ వైడ్ గా సీక్వెల్స్ కు గేట్లు తెరిచాయి అని రాజమౌళి 'బాహుబలి' సినిమా వల్లే నేను కూడా పొన్నియన్ సెల్వన్ మూవీ ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాను అని , పొన్నియన్ సెల్వన్ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది అని మణిరత్నం తాజాగా తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: