అలాగే తాను నటించిన డబ్బింగ్
మూవీ ద్వారా తెలుగు లో కూడా అనేక మంది అభిమానులను
ధనుష్ సంపాదించుకున్నాడు . ఇలా తెలుగు లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న
ధనుష్ ప్రస్తుతం
టాలీవుడ్ క్రేజీ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సార్ అనే
మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ తెలుగు మరియు
తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా
ధనుష్ 'తిరుచిత్రంబళం' అనే
మూవీ లో హీరోగా నటించాడు. ఈ
మూవీ తెలుగు లో తిరు అనే పేరుతో నిన్న అనగా ఆగస్ట్ 18 వ తేదీన
థియేటర్ లలో విడుదల అయ్యింది.
మిత్రన్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించగా,
రాశి కన్నా ఈ
మూవీ లో
ధనుష్ సరసన
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే
ధనుష్ 'తిరు'
మూవీ కోసం అదిరిపోయే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... తిరు
మూవీ కోసం
ధనుష్ 12 నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు
కోలీవుడ్ లో ఒక టాక్ వినపడుతోంది.