నాగార్జున 'ది ఘోస్ట్' డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ..!

frame నాగార్జున 'ది ఘోస్ట్' డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందు కున్నాడు . ఈ మూవీ కి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించగా , నాగ చైతన్య ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు . బంగార్రాజు మూవీ విజయంతో మంచి జోష్ లో ఉన్న నాగార్జున మరి కొన్ని రోజుల్లో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం లో తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు . ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను మూవీ యూనిట్ విడుదల చేయగా ఈ ప్రచార చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకులను ఆక ట్టుకునే విధంగా ఉన్నాయి . ది ఘోస్ట్ మూవీ ని దసరా సందర్భంగా అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది .


ఈ మూవీ లో అక్కినేని నాగార్జున సరసన అందాల ముద్దు గుమ్మ సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా కనిపించ బోతోంది . ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  నాగార్జున హీరోగా  తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు థియేటర్ రిలీజ్ అయిన కొన్ని వారాలకు ఈ మూవీ ని అమెజాన్ ప్రైమ్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: