ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రమోషన్ లను నిర్వహిస్తోంది. అందులో భాగంగా తాజాగా టైగర్
సినిమా దర్శకుడు
పూరి జగన్నాథ్ ,
విజయ్ దేవరకొండ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ ...
విజయ్ దేవరకొండ లో తనకు నిజాయితీ బాగా నచ్చింది అని చెప్పు కొచ్చాడు. అలాగే తన నిజాయితీ మాటల్లో మాత్రమే కాకుండా యాక్టింగ్ లో కూడా ఉంటుంది అని
పూరి జగన్నాథ్ అన్నాడు. తనకు అప్పులు ఉన్నాయి అని తెలిసి కూడా లైగర్ కోసం ఇచ్చిన 2 కోట్లను తిరిగి ఇచ్చేసి అప్పులు తీర్చుకో మని చెప్పాడు. ఇలాంటి హీరోలను తను చూడలేదు అని అన్నిటికి సపోర్ట్ గా ఉన్నాడు అని
పూరి జగన్నాథ్ తాజాగా చెప్పు కొచ్చాడు.