ఎట్టకేలకు
టాలీవుడ్ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. జూన్- జూలై నెలల్లో చాలా సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి.కానీ చెప్పకోదగ్గ చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా కనిపించలేదు.అయితే ఆగస్టు నెలలో మాత్రం మళ్లీ
సక్సెస్ ఊపు కనిపించింది. ఇటీవల రిలీజ్ అయిన `బింబిసార`.. `సీతా రామం` సినిమాలు పెద్ద
బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. అవి ఈ రేంజ్లో
సక్సెస్ అవుతాయని అసలు ఊహించలేదు. ఇక ముందు నుంచి మంచి బజ్ క్రియేట్ చేసుకున్న `కార్తికేయ 2`
సినిమా మాత్రం వాటిని నిలబెట్టుకోవడంలో నూరుశాతం
సక్సెస్ అయింది.పాన్
ఇండియా కేటగిరిలో రిలీజయ్యి అన్ని భాషల్లోనూ దూసుకుపోతుంది.
హిందీ బెల్డ్ లో సైతం
సినిమా బాగా పుంజుకుంటుంది. పాజిటివ్ టాక్ నేపథ్యంలో అక్కడ థియేటర్ల సంఖ్య పెంచుతున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇది నార్త్ నుంచి కార్తికేయ-2 సినిమాకి ఊహించని ఫలితంగా చెప్పొచ్చు. పుష్ప తరహాలోనే అక్కడ కార్తికేయ-2
సినిమా విషయంలో బాక్సాఫీస్ వద్ద మిరాకిల్ జరగడానికి ఆస్కారం ఉంది.రీసెంట్గా నార్త్‌లో `లాల్ సింగ్ చద్దా`..`రక్షాబంధన్`వంటి భారీ చిత్రాలు విడుదల కాగా, ఇవి రెండు నిరాశపరిచాయి. దీంతో ఆ అవకాశాన్ని మన తెలుగు హీరో నిఖిల్ వాడుకుంటున్నాడు.
`కార్తికేయ 2`
సినిమా హిందీ ప్రాంతాలలో ప్యాక్డ్ హౌస్‌లను రికార్డ్ చేస్తోంది. ప్రతి నిమిషానికి కూడా షోలు పెరుగుతున్నాయి.
బాలీవుడ్ రివ్యూలు ఇంకా ఫీడ్ బ్యాక్ లు పాజిటివ్ గా వస్తున్నాయి. `పుష్ప` – `ఆర్ ఆర్ ఆర్` సినిమాల తర్వాత హిందీలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న తెలుగు చిత్రంగా ఈ
సినిమా నిలుస్తుంది.అయితే మరి కొద్ది రోజులలో
విజయ్ దేవరకొండ తన లైగర్‌తో ఇలాంటి ప్రభంజనం సృష్టించాలని ఎంతగానో అనుకున్నాడు. కాని అతని
కన్నా ముందు నిఖిల్ ఆ వైబ్స్ క్రియేట్ చేసి అందరికి కూడా పెద్ద షాక్ ఇచ్చాడు.
బాలీవుడ్ లో లైగర్
సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. పైగా నిర్మాణంలో
ధర్మ ప్రొడక్షన్స్ భాగం కావడంతో స్పాన్ కూడా మరింత పెరిగింది. నేరుగా ఓ
హిందీ సినిమా రిలీజ్ జరుగుతున్నంత హడావుడి ఈ లైగర్ విషయంలో చోటు చేసుకుంది.కానీ
విజయ్ కంటే ముందే నిఖిల్ తన
కార్తికేయ 2 సినిమాతో నార్త్ ఇండియాని షేక్ చేస్తున్నాడు.