గ్లామరస్ యాంకర్
శ్రీముఖి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల ద్వారా కెరీర్ మొదలు పెట్టిన
శ్రీ ముఖి ఆ తర్వాత కొన్ని
టీవీ షో లకు యాంకర్ గా కూడా వ్యవహరించింది.
శ్రీ ముఖి యాంకర్ గా వ్యవహరించిన
పటాస్ కామెడీ షో అద్భుతమైన
సక్సెస్ సాధించడం , అలాగే
రవి మరియు
శ్రీ ముఖి ఇద్దరు కూడా ఈ షో కి యాంకర్ లుగా వ్యవహరించడం, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడంతో ఈ ఇద్దరికి ఈ షో ద్వారా మంచి గుర్తింపు లభించింది.
ఆ తర్వాత
శ్రీ ముఖి సోలో గా కూడా ఎన్నో
టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి తనదైన రీతిలో యాంకరింగ్ తో ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. శ్రీ ముఖి తెలుగు ప్రముఖ
రియాలిటీ షో లలో ఒకటి అయిన
బిగ్ బాస్ హౌస్ లో కూడా పాల్గొంది. ఈ షో ద్వారా కూడా
శ్రీ ముఖి ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే
శ్రీ ముఖి ఇప్పటికే ఎన్నో సినిమాలలో ఎన్నో పాత్రలలో నటించింది. అలాగే
శ్రీ ముఖి కొంత కాలం క్రితం క్రేజీ అంకల్స్ అనే
మూవీ లో కూడా ప్రధాన పాత్రలో నటించింది.
శ్రీ ముఖి కి ఈ
మూవీ బాక్సాఫీస్ దగ్గర అపజయాన్ని అందించింది.
ఇది ఇలా ఉంటే
టీవీ షో ల ద్వారా, సినిమాల ద్వారా,
బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్
మీడియా ద్వారా వారితో టచ్ లో కూడా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా కొన్ని తాజాగా
శ్రీ ముఖి తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో
శ్రీ ముఖి అవుట్ అండ్ అవుట్
రెడ్ కలర్ డ్రెస్ ని వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం
శ్రీ ముఖి కి సంబంధించిన ఈ ఫోటోలు నెటింట వైరల్ గా మారాయి.