ఆయన డైరెక్షన్లో చేయాలని ఉంది : విజయ్ దేవరకొండ

praveen
ప్రస్తుతం అందరి చూపు ఒకే సినిమాపై ఉంది. అదే రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండ్య జంటగా నటించిన లైగర్ సినిమాపై. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదలైన ట్రైలర్  ప్రేక్షకుల్లో ఊహించని రీతిలో అంచనాలు పెంచేసింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఒక స్లమ్ లో ఉన్న యువకుడి నుంచి ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో బాక్సర్ గా ఎదిగిన  యువకుడి కథను చూపించబోతున్నారు అన్నది తెలుస్తుంది. అయితే నత్తి ఉన్న పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు.


 ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలరే ఇలా ఉంటే ఇక సినిమా ఏ రేంజిలో ఉంటుందో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయితే ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం సినిమా బృందం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. దీంతో ఇండియా మొత్తం ప్రమోషన్స్ చేస్తుంది లైగర్ చిత్ర బృందం. ఇటీవల చెన్నైలో ప్రమోషన్స్ నిర్వహించారు. చెన్నైలో నిర్వహించిన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. లైగర్  సినిమాలో నా పాత్ర నత్తి ఉంటుంది. అలా నటించడానికి ఎంతగానో కష్టపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు.


 ఇక ఈ సినిమాలో తన పాత్ర ఎంతో బలంగా ఉంటుంది అంటూ తెలిపాడు. గతంలో తమిళంలో నోటా సినిమా చేసానని తమిళ ప్రేక్షకులు మంచి చిత్రాలను ఆదరిస్తారు. ఇక రానున్న రోజుల్లో కూడా తమిళంలో కూడా వరుసగా నటిస్తాను. లోకేష్ కనకరాజ్, వెట్రిమారన్, రంజిత్ అంటే ఎంతో ఇష్టం. వారితో ప్రస్తుతం ఫోన్లో టచ్లో ఉన్నాను. త్వరలో లోకేష్ కనకరాజు  దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ.  అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఏ భాషలో ప్రమోషన్స్ నిర్వహించడానికి వెళితే ఆ భాషలో ఉన్న ప్రముఖులు అందరు కూడా పొగిడేస్తున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: