RRR చిత్రానికి అగ్ర దేశం లో అవార్డులు వస్తాయా..?

Divya
RRR సినిమా థియేటర్ లోకి వచ్చి మంచి విజయాలను సాధించడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్ కూడా సాధించింది ఆ తర్వాత ఓ టి టి లో కూడా తన సత్తా చాటిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఈ సినిమా ఫీవర్ అయితే మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు మరి కొన్ని గంటల్లో ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్స్ కూడా మొదలుకానున్నాయి. ఇక ఇదంతా ఇలా ఉండగా ఇప్పటికే ఇలాంటి చిత్రాల పైన ప్రపంచవ్యాప్తంగా మంచి అంశాలు ఉండడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నది. కొంతమంది హాలీవుడ్ సినీ తారల సైతం rrr సినిమా మేకింగ్ పైన ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇందులో కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా వారు ప్రత్యేకంగా చూసి పొగడడం జరిగింది.

ఇక రాజమౌళి ఇద్దరు అగ్ర హీరోలను చూపించే విధానంలో కూడా భాగ వర్కౌట్ అయ్యారు అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ వారి పాత్రలో భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను బాగా అలరించారని చెప్పవచ్చు ఇక పలు అవార్డుల వేడుకలలో కూడా ఇప్పుడు ఈ సినిమా పేర్లు చర్చనీయాంశంలో మారుతున్నది. సైన్స్ ఫిక్షన్ హర్రర్ అలాగే ఫాంటసీ చిత్రాలను గౌరవించే సాటర్న్ అమెరికన్ అవార్డులలో ఈ చిత్రం నామినేట్ చేయబడినట్లు తెలుస్తోంది.
ఇక rrr సినిమా విజువల్స్ ఎఫెక్ట్ సూపర్వైజర్ వర్క్ గా చేసిన శ్రీనివాస్ మోహన్ కూడా ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు rrr సినిమా దర్శకత్వం ఉత్తమ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అని మూడు విభాగాలు ఈ సినిమా నామినేట్ చేయబడింది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డు వేడుకలలో ఈ తెలుగు సినిమా నామినేట్ కావడం ఒక హిస్టారికల్ ఫిట్ అని చెప్పవచ్చు. ఈ అవార్డులను అక్టోబర్ 25న ప్రకటిస్తారు మరి ఈ వేడుకలలో rrr చిత్రం అవార్డులను ఏదైనా సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: