ఈ
మూవీ విడుదల తేది దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ
మూవీ యూనిట్ సభ్యులు వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు . ఇందులో భాగంగా తాజాగా
విజయ్ దేవరకొండ కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . తాజా ఇంటర్వ్యూ లో భాగంగా
విజయ్ దేవరకొండ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు . తాజా ఇంటర్వ్యూ లో భాగంగా
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ... మొదట్లో ఏదైనా విషయం గురించి ప్రశ్నిస్తే చాలా ఎక్కువగా మాట్లాడే వాడిని , కాక పోతే ప్రస్తుతం అది అనవసరం అనిపిస్తుంది . అలాంటి ప్రశ్నల విషయంలో కొంత మంది ముందు గానే నాపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటున్నారు . నేను చెప్పే విషయాలు వారి ఆలోచన లో మార్చవు . అందుకే కొన్ని సమయాల్లో నోరు విప్పక పోవడం మంచిది అని నేను నమ్ముతున్నాను అని
విజయ్ దేవరకొండ తాజా ఇంటర్వ్యూలో చెప్పు కొచ్చాడు .