నందమూరి
కళ్యాణ్ రామ్ తాజాగా బింబిసార అనే
మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి మల్లాడి వశిష్ఠ దర్శకత్వం వహించగా , క్యాథరిన్ మరియు సంయుక్త
మీనన్ ఈ
మూవీ లో
కళ్యాణ్ రామ్ సరసన
హీరోయిన్ లుగా నటించారు. ఈ
మూవీ ని ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ
మూవీ పై సినీ ప్రేమికుల్లో మొదటి నుండి మంచి అంచనాలు నెలకొని ఉండటం , అలాగే ఈ
మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ రావడంతో ఈ
మూవీ కి ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇప్పటికే ఈ
మూవీ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువగా షేర్ కలెక్షన్ పను వసూలు చేసి బాక్సా ఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకుంది.
బింబిసార
మూవీ ప్రపంచ వ్యాప్తంగా 15.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుగుతుంది. ఈ
మూవీ ప్రపంచ వ్యాప్తంగా 16.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలో దిగింది. ఇప్పటి వరకు ఆరు రోజుల బాక్సా ఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ
మూవీ ప్రపంచ వ్యాప్తంగా 24.84 కోట్ల షేర్ , 41.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ
మూవీ 8.64 కోట్ల లాభాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది. ప్రస్తుతం కూడా ఈ
సినిమా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబడుతోంది. మరి రాబోయే రోజుల్లో ఈ
మూవీ బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ లాభాలను అందుకుంటుందో చూడాలి.