ఆ సినిమాకి షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకున్న చైతూ?

Purushottham Vinay
ఇక టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగచైతన్య విడాకుల తరువాత తన కెరీర్ పై పూర్తిగా ద్రుష్టిని సారించి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.నాగచైతన్య సినీ ఇండస్ట్రీకి ఎంత ఇచ్చి మొత్తం 13 ఏళ్లు కావస్తోంది. మొదట జోష్ సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే నాగచైతన్య ఇటీవలే థాంక్యూ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఇంకా అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో కలసి లాల్ సింగ్ చద్దా సినిమాలో కూడా నటించాడు నాగచైతన్య.అలాగే త్వరలోనే ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు నాగచైతన్య. కాగా ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు నాగ చైతన్య తీసుకున్న రెమ్యునరేషన్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమాలకు ఒక్కొక్క సినిమాకు గాను దాదాపు 5 నుంచి 10 కోట్ల వరకు కూడా రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.


కాగా నాగచైతన్య నటించిన బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దా సినిమాలో బాల పాత్రకు అయితే నాగచైతన్య ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ ని అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో నాగచైతన్య బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న విషయం  కూడా తెలిసిందే.ఈ సినిమా విడుదల తర్వాత నాగచైతన్యకు భారీగా అవకాశాలు వచ్చే సూచనలు ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. కాగా ఈ సినిమా హిందీతో పాటు ఇంకా తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే నాగ చైతన్య ఇప్పటికే తమిళ డైరెక్టర్ వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెలుగు ఇంకా తమిళ భాషల్లో ద్విభాష చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఇంకా అలాగే డీజే టిల్లు సినిమా డైరెక్టర్ విమల్‌ కృష్ణతో కూడా చైతూ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటితో పాటుగా నాగచైతన్య వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నట్టు సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: