నాగార్జున... అఖిల్ కాంబినేషన్ లో క్రేజీ మల్టీస్టారర్ మూవీ..!

Pulgam Srinivas
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మల్టీస్టారర్ సినిమాల జోరు ఫుల్ గా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ హీరోలు మల్టీస్టారర్ మూవీ లలో నటించి మంచి విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నారు. కొంత కాలం క్రితం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో లుగా తెరకెక్కిన భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుందో మన అందరికీ తెలిసిందే.


ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1100  కోట్లకు పైగా కలెక్షన్ లను వసూలు చేసి ఇ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.  ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరో భారీ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతున్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న కుటుంబాలలో అక్కినేని కుటుంబం ఒకటి. ఇది వరకే ఈ ఫ్యామిలీ నుండి కొంత మంది హీరోలు కలిసి నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి.


ఈ సంవత్సరం ప్రారంభంలో నాగార్జున మరియు నాగ చైతన్య కలిసి నటించిన బంగార్రాజు మూవీ కూడా మంచి విజయం సాధించిన సాదించింది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లో నాగార్జున మరియు అఖిల్ కలిసి ఒక మల్టీస్టారర్ మూవీ లో నటించబోతున్నట్లు ,  ఆ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జున తన సొంత బ్యానర్ లోనే ఈ మూవీ ని నిర్మించే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: