దుల్కర్
సల్మాన్ హీరోగా మృణాలిని ఠాకూర్
హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో సీతా రామం అనే
ప్రేమ కథ చిత్రం తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో
రష్మిక మందన ఒక ముఖ్యమైన పాత్రలో నటించగా , సుమంత్ ,
తరుణ్ భాస్కర్ ,
గౌతమ్ వాసుదేవ్
మీనన్ , భూమికా చావ్లా ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు.
అలాగే
ప్రకాష్ రాజ్ ,
సునీల్ ,
ప్రియదర్శి ఈ
మూవీ లో మరి కొన్ని పాత్రలో నటించారు.
వైజయంతి సినిమాస్ , స్వప్న మూవీస్ బ్యానర్ లపై ప్రముఖ
నిర్మాత అశ్వనీదత్ ఈ
మూవీ ని ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ
మూవీ మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 5 వ తేదీన భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఇది ఇలా ఉంటే మొదటి నుండి ఈ
మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్న కారణంగా ఈ
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అందులో భాగంగా ఈ
మూవీ కి ఓవర్సీస్ లో కూడా అదిరిపోయే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఓవర్సీస్ లో సీతా రామం
మూవీ 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఇలా మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్నా సీతా రామం
సినిమా విడుదల అయిన మొదటి రోజే
బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఓవర్సీస్ లో ఈ
మూవీ కి అద్భుతమైన కలెక్షన్ లు దక్కుతున్నాయి. దానితో ఇప్పటికే సీతా రామం
మూవీ ఓవర్సీస్నాలో బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని లాభాలను అందుకుంటుంది. సీతా రామం
మూవీ నాలుగు రోజులకు గాను ఓవర్సీస్ లో 3.15 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసి బ్రేక్ ఫార్ములాను కంప్లీట్ చేసుకొని లాభాలను అందుకుంటోంది.