టాలీవుడ్
యువ హీరోలలో ఒకరు అయినా నిఖిల్ తాజాగా
కార్తికేయ 2
మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే . ఈ
సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న
కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది .
కార్తికేయ మూవీ లో నిఖిల్ హీరోగా నటించగా కలర్స్
స్వాతి హీరోయిన్ గా నటించింది . చందు మొండేటి ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు . ఈ
మూవీ లో నిఖిల్ మరియు కలర్స్
స్వాతి జంటకు ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి .
దానితో కలర్స్
స్వాతి ని పక్కన పెట్టారు అని వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా స్పందించిన నిఖిల్...
కార్తికేయ 2
మూవీ కథా పరంగా నార్త్
ఇండియన్ లుక్ ఉన్న
అమ్మాయి కావాలి. అందువలన ఈ
మూవీ లో
హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకోవడం జరిగింది. అంతే గానీ స్వాతిని కావాలని పక్కన పెట్టలేదు అంటూ తాజాగా నిఖిల్ చెప్పుకొచ్చాడు.
కార్తికేయ 2
మూవీ కి చందు మొండేటి దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ ని ఆగస్ట్ 13 వ తేదీన విడుదల చేయనున్నారు.