ఆ డైరెక్టర్ కూతురు సక్సెస్ అయ్యేనా..?

Divya
దక్షిణాది అగ్ర డైరెక్టర్లలో డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లి డైరెక్టర్లలో ఈయన కూడా ఒకరు. ఇప్పటివరకు తమిళ చిత్రాలు చేసిన ఈయన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి RC -15 సినిమాతో నేరుగా టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు అయితే శంకర్ తో పాటు ఆయన కూతురు కూడా తెలుగు సినిమా పరిశ్రమపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ చిన్న కుమార్తె అదితి కోలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నది.

కార్తి హీరోగా తెరకెక్కిస్తున్న విరుమాన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది. మొదటి చిత్రం విడుదల కాకముందే ఈ ముద్దుగుమ్మ మరొక క్రేజీ సినిమా ప్రాజెక్టులో నటించే అవకాశాన్ని దక్కించుకుంది శివ కార్తికే హీరోగా నటిస్తున్న మహావీరుడు అనే బైల్వింగ్ సినిమాలో ఈమె నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకి డైరెక్టర్గా మడోన్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. శాంతి టాకీస్ బ్యానర్ పై ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతోంది. ఈ సినిమా బుధవారం రోజున చెన్నైలో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు డైరెక్టర్ శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఇప్పుడు అదితి తెలుగులో ఒక సినిమా చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ఒకసారి హీరోతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అదితి అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజం ఎంత ఉందని విషయం తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.. వరుణ్ తేజ్ నటించిన గని చిత్రంలో ఈమె ఒక పాటను కూడా పాడింది. దీంతో ఈ ముద్దుగుమ్మ త్వరలోనే హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తున్నది. ఇక ఇప్పటికే తమిళంలో రెండు సినిమాలలో నటించింది. ఈ సినిమాలు తెలుగులో కూడా విడుదలబోతున్నాయి. డైరెక్టర్ శంకర్ కుమార్తెను ఆయన ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తోంది మరి ఈమె సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: