యంగ్ అండ్ ఎనర్జిటిక్
హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈస్మార్ట్
శంకర్ ,
రెడ్ వంటి రెండు వరుస విజయాల తర్వాత తాజాగా
రామ్ పోతినేని 'ది వారియర్' అనే పవర్ఫుల్
మాస్ ఎంటర్టైనర్
మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ
మూవీ లో
రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ
మూవీ కి
తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వం వహించగా , యంగ్
బ్యూటీ కృతి శెట్టి ఈ
మూవీ లో కథానాయికగా నటించింది.
మంచి అంచనాల నడుమ జులై 14 వ తేదీన ది
వారియర్ మూవీ తెలుగు మరియు
తమిళ భాషలలో గ్రాండ్ గా విడుదల అయ్యింది.
తమిళ దర్శకుడు లింగుసామి ఈ
మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ
మూవీ పై
తమిళ సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. దానితో ఈ
మూవీ కి
తమిళ ఇండస్ట్రీ లో కూడా అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
తమిళ నాట ది
వారియర్ మూవీ కి 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
అలా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను
తమిళ నాట జరుపుకున్న ది
వారియర్ మూవీ టోటల్
బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి
తమిళ వర్షన్ 1.5 కోట్ల షేర్ , 3.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దీనితో చివరగా ది
వారియర్ మూవీ తమిళ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 2.5 కోట్ల మేర నష్టాలను మిగిల్చింది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ లో
ఆది పినిశెట్టి ప్రతి నాయకుడి పాత్రలో నటించగా , రాక్ స్టార్ దేవి
శ్రీ ప్రసాద్ ఈ
మూవీ కి సంగీతాన్ని అందించాడు. దేవి
శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అందించిన పాటలకు , సంగీతానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.