ఈ ఇద్దరు కూడా ఈ
మూవీ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఈ
మూవీ లో మళయాల నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రతి నాయకుడి పాత్రలో నటించగా , రాక్ స్టార్ దేవి
శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ
సినిమా విజయంలో దేవి
శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ప్రధాన పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్న విషయం మన అందరికి తెలిసిందే మరి కొన్ని రోజుల్లోనే పుష్ప ది రూల్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ
సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు ఈ సినిమాకు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో ఒక సీనియర్
పోలీస్ ఆఫీసర్ పాత్ర ఉందని , ఆ పాత్రను
విజయ్ సేతుపతి పోషించ బోతున్నాడు అని వార్తలు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో
విజయ్ సేతుపతి భార్యగా
ప్రియమణి కనిపించబోతున్నట్లు , ఈ సినిమాలో
ప్రియమణి నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.